
సారథి న్యూస్, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగేశ్వర్ రావు సోమవారం తన పదవికి రాజీనామా చేశారు. వైద్యాశాఖ ఉన్నతాధికారులకు తన రాజీనామా లెటర్‌ను పంపించారు. అయితే ఇటీవల జిల్లాకేంద్రంలో కరోనాతో మృతిచెందిన ఓ పేషెంట్‌ను ఎలాంటి భద్రతాచర్యలు పాటించకుండా ఆటోలో తీసుకెళ్లారు. పీపీఈ కిట్లు మాత్రమే ధరించిన సిబ్బంది మాత్రమే అంబులెన్స్‌లో తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే జిల్లా ఆస్పత్రిలో సకాలంలో సరైన వైద్యం అందక నలుగురు రోగులు మృతిచెందారు. ఈ వరుస ఘటనలపై పై నుంచి ఉన్నతాధికారులు తీవ్రంగా మందలించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు స్పష్టమవుతోంది.