షార్జా: ఐపీఎల్13వ సీజన్లో భాగంగా షార్జా వేదికగా ముంబై ఇండియన్స్‌తో జరిగిన 41వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చిత్తుగా ఓడింది. దీంతో ప్లే ఆఫ్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమించింది. మొదట సీఎస్కే నిర్దేశించిన 115 పరుగుల టార్గెట్‌ను ఇషాన్ కిషన్(68 నాటౌట్; 37 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), డీకాక్(46 నాటౌట్; 37 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) వికెట్ పడకుండా 12 ఓవర్లలోనే ఛేదించారు. ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. ధోని(16), సామ్ కరాన్(32), శార్దూల్ ఠాకూర్(11) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. ముంబై బౌలర్లలో బౌల్ట్ నాలుగు వికెట్లు తీశారు. బుమ్రా, రాహుల్ చాహర్ రెండు వికెట్ల చొప్పున తీశారు. కౌల్టర్‌నైల్‌కు ఒక వికెట్ దక్కింది. అంతకుముందు టాస్ గెలిచిన ముంబై ఫీల్డింగ్ ఎంచుకోవడంతో సీఎస్కే బ్యాటింగ్‌కు దిగింది.
సీఎస్కే వరుస వికెట్లు కోల్పోతున్న సమయంలో సామ్ కరాన్ నిలబడ్డాడు. 47 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఆకట్టుకుని 52 పరుగులు సాధించాడు. 50 పరుగులకే ఆలౌట్ అవుతుందని అనిపించినా కరాన్ ఒంటరి పోరాటంతో నడిపించాడు. అదే సమయంలో ఆలౌట్ నుంచి కూడా తప్పించుకుంది. కరాన్‌కు తాహీర్(13 నాటౌట్) నుంచి సహకారం లభించడంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 114 పరుగులు చేసింది. బౌల్ట్ వేసిన 20 ఓవర్ ఆఖరి బంతికి కరాన్ బౌల్డ్ అయ్యాడు.
- October 23, 2020
- Archive
- Top News
- క్రీడలు
- IPL13 SEASON
- MUMBAI INDIANS
- SHARJHA
- ఐపీఎల్13
- ముంబై ఇండియన్స్
- షార్జా
- సీఎస్కే
- Comments Off on చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్