Breaking News

కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య

కిరోసిన్ పోసుకుని యువతి ఆత్మహత్య

సారథి న్యూస్, రామాయంపేట: అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి కిరోసిన్​పోసుకుని నిప్పంటించుకుని సూసైడ్​చేసుకుంది. ఈ ఘటన శనివారం చోటుచేసుకుంది. మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నందిగామకు చెందిన దేవసాని రేవతి(19) రెండేళ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోంది. చికిత్స చేయించినా నయం కాకపోవడం, అలాగే తన కుటుంబసభ్యులు తనకు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అనారోగ్యంతో ఉంటూనే ఇప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేకపోవడంతో మనస్తాపం చెందింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తనంతట తాను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. మంటలు అర్పేసరికి చనిపోయిందని మృతురాలి తల్లి సుమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిజాంపేట ఎస్సై ప్రకాశ్ గౌడ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.