
సారథి న్యూస్, నిజాంపేట: మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని నార్లాపూర్ గ్రామానికి చెందిన రాజేందర్ గౌడ్ కు రెండు కిడ్నీలు చెడిపోయాయి. దీంతో వైద్య ఖర్చులు, కిడ్నీ మార్పిడి కోసం బాధిత కుటుంబసభ్యులు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సహకారంతో ప్రధాన మంత్రి జాతీయ సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. మంజూరైన రూ.మూడులక్షల ఎల్వోసీని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తన క్యాంపు ఆఫీసులో బాధిత కుటుంబసభ్యులకు అందజేశారు.