Breaking News

ఆదిలాబాద్​లో అలజడి

సారథి న్యూస్ ఆదిలాబాద్: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఆదిలాబాద్​లో ప్రస్తుతం కరోనా కేసులు పేరుగుతున్నాయి. జిల్లాలో రోజుకు పదుల సంఖ్యలో కేసులు వస్తుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఆదిలాబాద్​ జిల్లా కేంద్రంలో కలెక్టర్​ ఓఎస్డీ, కలెక్టర్​ క్యాంప్​ క్లర్క్​లకు కరోనా పాజిటివ్​ వచ్చినట్టు జిల్లా వైద్యశాఖ అధికారులు ధ్రువీకరించారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పనిచేస్తున్న మిగిలిన సిబ్బందికి అందరికీ కరోనా  నిర్ధారణ పరీక్షలు చేసేందుకు శుక్రవారం వీరంతా శాంపిల్స్ ఇచ్చారు. కాగా ఇటీవల కలెక్టర్​రేట్​కు వచ్చినవారిలో ఆందోళన నెలకొన్నది.