సారథి న్యూస్, కర్నూలు: కర్నూలు జిల్లా కలెక్టర్ హోం క్వారంటైన్ ను రద్దుచేయడమంటే ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటళ్లకు దోచిపెట్టడమేనని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పీఎస్ రాధాకృష్ణ ఆక్షేపించారు. హోం క్వారంటైన్ ను రద్దుచేస్తూ కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రాజశేఖర్, టి.రాముడు, రామకృష్ణ, నాగరాజ్, సి.గోవింద్, గురుశేఖర్, సాయిబాబా, గోపాల్, షరీఫ్ రామకృష్ణ పాల్గొన్నారు.
- August 19, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- COLLECTOR
- HOMEQUARANTINE
- KURNOL
- కర్నూలు
- కలెక్టర్
- హోం క్వారంటైన్
- Comments Off on హోం క్వారంటైన్ రద్దు సరికాదు