Breaking News

హిందూ ముస్లిం భాయ్ భాయ్

సోమవారం ఈద్ పండుగను ముస్లిం సోదరులంతా ఘనంగా జరుపుకున్న సందర్భంగా బాలీవుడ్ భాయ్ సల్మాన్ ఖాన్ హిందూ ముస్లింల సఖ్యత చాటుతూ ఓ పాప్ సాంగ్​ను తన అభిమానులకు గిఫ్ట్ చేశాడు. విశాలమైన ప్రదేశంలో ఎలాంటి హంగూ ఆర్భాటం లేకుండా జస్ట్ ఒక వుడ్ చైర్​లో కూర్చొని.. ఓ మైక్ చేతబుచ్చుకుని.. ఈజీ స్టెప్స్​తో ఈ పాటను పాడాడు సల్మాన్. ఈ సాంగ్​ను సల్మాన్​ స్వయంగా పాడడమే కాదు.. దనిష్ శబ్రితో కలిసి సల్మాన్ సొంతగా లిరిక్స్ సమకూర్చాడు. ర్యాప్ పోర్షన్​ ను రుహానా అర్షద్ రాయగా సాజిద్ వాజిద్ కంపోజ్ చేసిన ఈ సాంగ్​ను యూట్యూబ్​లో అప్​లోడ్​ చేశారు.

హిందూ ముస్లిం భాయ్ భాయ్

‘యారోంకె హమ్ తయ్యార్.. కర్ అప్నే హితే వార్ హై..’ అంటూ సాగే ఈ సాంగ్​లో ‘రమజాన్ మే హై రామ్.. దీవాలీ మే హై అలీ .. హిందూ ముస్లిం సిక్ సాయి సబ్ అప్నే భాయ్ భాయ్..’ అన్న చరణాలు చాలా ఆకట్టుకుంటున్నాయి. కరోనా బాధితులు కొంతమందికి ఆర్థికంగా కూడా సాయపడిన సల్మాన్.. ఈ లాక్​ డౌన్​ సమయంలో రిలీజ్ చేసిన మూడో పాప్ సాంగ్ ఇది. హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ ఉన్న ఈ పాటలో 2020లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి కూడా ప్రస్తావించాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పాప్ సాంగ్ అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నాడు భాయ్ సల్మాన్.