తీన్మార్ సావిత్రి అలియాస్ శివజ్యోతి అరుదైన రికార్డు సాధించింది. తెలంగాణ భాష, యాసలో వార్తలు అందించే ఆమె ‘జ్యోతక్క’ పేరుతో ఆగస్టు 1వ తేదీన స్టార్ట్ చేసిన యూ ట్యూబ్ చానెల్‌కు అతితక్కువ కాలంలోనే లక్ష మంది ఫాలోవర్స్‌ను సంపాదించుకుంది. ఆమె పోస్ట్ చేసిన వీడియోస్‌ను సుమారు 7.67లక్షల మంది వీక్షించారు. ఈ సందర్భంగా ఆమె సబ్స్ర్కైబర్స్కు థ్యాంక్స్ చెప్పింది. టెలివిజన్ వ్యాఖ్యాతగా తెలుగు న్యూస్ చానెల్ వీ6 తీన్మార్ వార్తల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. బిత్తిరి సత్తితో కలిసి అచ్చమైన తెలంగాణ, గ్రామీణ భాషలో న్యూస్ అందించేది. బిగ్‌బాస్ షోలోనూ సందడి చేసింది. శివజ్యోతి నిజామాబాద్ జిల్లా ముప్కల్ మండలం నాగంపేట గ్రామానికి చెందిన యశోద, రాజమల్లేష్ దంపతుల కూతురు. తల్లి బీడీ కార్మికురాలు కాగా, తండ్రి ఆర్ఎంపీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఆమె టీవీ 9 ఛానల్ లో ఇస్మార్ట్ న్యూస్ వ్యాఖ్యాతగా పనిచేస్తోంది.
- September 3, 2020
- Archive
- సినిమా
- ISMARTNEWS
- SAVITHRI
- TEENMAR
- V6NEWS
- ఇస్మార్ట్న్యూస్
- టీవీ9
- తీన్మార్
- వీ6 న్యూస్
- సావిత్రి
- Comments Off on సావిత్రి ఫాలోవర్స్ లక్షమంది