సారథి న్యూస్, మహబూబ్ నగర్: వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరంపేట సమీపంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన సరళాసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని టీపీసీసీ కార్యదర్శి జి.మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన పార్టీ నేతలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ఆరునెలలుగా తాము చేస్తున్న పోరాటాలు, ఒత్తిడి వల్ల పనులు వేగవంతంగా పూర్తయ్యాయని అన్నారు. కానీ స్థానిక ఎమ్మెల్యే తన స్వీయ స్వార్థ ప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి పనులను గాలికొదిలేశారని విమర్శించారు.
ఆయకట్టుకు కుడి, ఎడమ కాల్వ ద్వారా వెంటనే నీటిని విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట టీపీసీసీ మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాలమణెమ్మ, వనపర్తి జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్యూఐ జిల్లా అధ్యక్షుడు కృష్ణవర్ధన్ రెడ్డి , వనపర్తి జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బోయేజ్, మదనాపూర్ మండలాధ్యక్షుడు విజయేందర్ రెడ్డి ఉన్నారు.