![సత్తన్న అందుకే అలా..](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/06/satti-f.jpg?fit=600%2C504&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: బుల్లితెర రియాలిటీ హిట్ షో బిగ్బాస్హౌస్లోకి బిత్తిరి సత్తి వెళ్లనున్నారా.. అందుకే తాను పనిచేస్తున్న చానెల్లో ఉద్యోగానికి రాజీనామా చేశారా.. అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు. తీన్మార్ వార్తల ద్వారా బిత్తిరి సత్తిగా సుపరిచితుడైన చేవెళ్ల రవికుమార్ బిగ్బాస్ సీజన్4లో పాల్గొనున్నట్లు తెలిసింది. ఆయనతో పాటు ప్రముఖ యాంకర్, గాయని మంగ్లీ, హీరో తరుణ్, యాంకర్ వర్షిణి సౌందరరాజన్, సీరియల్ నటుడు అఖిల్ సార్థిక్ బిగ్బాస్ హౌస్లో సందడి చేయనున్నట్లు తెలిసింది. అయితే ఈసారి వ్యాఖ్యతగా ప్రిన్స్మహేశ్బాబు వ్యవహరించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆయనకు టైం కుదరకపోతే అక్కినేని నాగార్జున సందడి చేయనున్నట్లు తెలిసింది.