Breaking News

శాంతియుతంగా నిరసనలు తెలపండి

వాషింగ్టన్‌: ఆందోళనకారులు శాంతియుతంగా నిరసన తెలపాలని అమెరికా ఫస్ట్‌ లేడీ మెలానియా ట్రంప్‌ విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ప్రతిఒక్కరూ కర్ఫ్యూ రూల్స్‌ను పాటించాలని మెలానియా ట్రంప్‌ కోరారు. ‘కలిసికట్టుగా పనిచేస్తేనే అన్నినగరాల్లో ప్రజలకు భద్రత కల్పించగలం. అందరూ వీధులు వదిలి ఇళ్లలోకి వెళ్లండి. ఫ్యామిలీతో గడపండి’ అని మెలానియా ట్వీట్‌ చేశారు. అమెరికన్లు గొడవకు దిగొద్దని ఆమె రిక్వెస్ట్‌ చేశారు. శాంతియుతంగా ఆందోళనలను అమెరికా స్వాగతిస్తుందని, హింస వద్దని ఆమె మరో ట్వీట్‌ చేశారు. ఆఫ్రికన్‌ అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతిని నిరసిస్తూ అమెరికావ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. ఆందోళనకారులను తరిమికొట్టేందుకు చాలాచోట్ల కర్ఫ్యూ విధించారు. ఆందోళనలు వైట్‌హౌస్‌ను కూడా తాకడంతో ట్రంప్‌ తన కుటుంబంతో పాటు రెండు రోజుల పాటు బంకర్లలోకి వెళ్లారు.