సారథి న్యూస్, పెద్దశంకరంపేట: ఆశ్వయుజ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని పెద్దశంకరంపేటలో శనివారం రాత్రి భవానీ మాత పల్లకీ సేవను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన రథంపై అమ్మవారిని ఊరేగిస్తూ.. స్థానిక భవానీ మాత మందిరం నుంచి పట్టణ పురవీధుల గుండా పల్లకీ సేవ నిర్వహించారు. భక్తులు భజనలు, కీర్తనలు పాడుతూ ముందుకుసాగారు. మహిళలు మంగళహారతులతో వచ్చి ప్రత్యేకపూజలు చేశారు. భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
- November 1, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- BHAVANI MATHA
- medak
- PALLAKISEVA
- PEDDASHANKARAMPET
- పల్లకీసేవ
- పెద్దశంకరంపేట
- భవానీ మాత
- మెదక్
- Comments Off on వైభవంగా భవానీ మాత పల్లకీసేవ