ఒకప్పుడు ఆడవాళ్లు ఎక్కువగా మాట్లాడుకునేది వెంకీ అని.. ముద్దుగా పిలుచుకునే విక్టరీ వెంకటేష్ సినిమాల గురించే. ట్రెండ్ మారుతున్నా వెంకటేష్ హవా తగ్గలేదు. ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తియ్యడమూ మానలేదు. ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘నారప్ప’ సినిమా చేస్తున్నాడు. తమిళంలో ధనుష్ హీరోగా వచ్చిన ‘అసురన్’ సినిమాకి ఇది రీమేక్ అని తెలిసిందే. కానీ ట్రెండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ వైపు, ఓటీటీ ఫ్లాట్ ఫామ్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లో ఉండే నిర్మాత సురేష్ బాబు వెంకటేష్ తో ఓ వెబ్ సీరీస్ చేస్తే ఎలా ఉంటుందా? అని ప్లాన్ చేస్తున్నాడట.
డైరెక్టర్గా తేజను అనుకుంటున్నారట. రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు అనుకున్నదే తడవుగా కథ కోసం చర్చలు కూడా మొదలయ్యాయట. చర్చలు ఫలిస్తే సిరీస్ ఖాయమేనట. మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ను మొదలుపెట్టిన వెంకటేష్ ఇకమీదట వెబ్ సిరీస్ల విషయంలోనూ సరికొత్త ట్రెండ్ సృష్టిస్తాడేమో చూడాలి.