కోల్‌కతా: లాంగ్‌డ్రైవ్ పేరుచెప్పి గర్ల్‌ఫ్రెండ్‌ను నగరానికి దూరంగా తీసుకెళ్లిన ఓ యువకుడు ఆమెపై లైంగికదాడికి యత్నించాడు. యువతి కేకలు పెట్టడంతో అక్కడికి వచ్చిన మహిళపై హత్యాయత్నం చేశాడు. తన కారును మహిళపైకి ఎక్కించడంతో ఆమె రెండు కాళ్లు విరిగిపోయాయి. ఈ దారుణ ఘటన కలకత్తాలో చోటుచేసుకున్నది. దీంతో అతడిపై పోలీసు స్టేషన్లో కేసు నమోదయ్యింది. లాక్‌డౌన్‌తో చాలా కాలంగా ఇంట్లోనే ఉండిపోయిన యువత ఇటీవల కొంత రిలాక్స్ అవుతున్నారు.
కోల్‌కతాకు చెందిన ఓ యువతి శనివారం తన బాయ్‌ఫ్రెండ్‌ను కలుసుకుంది. అతడు లాంగ్‌డ్రైవ్‌కు వెళ్దాం అని పట్టుబట్టడంతో ఇద్దరూ కలిసి కలకత్తా నుంచి ఆనందపూర్ వైపు చాలా దూరం వెళ్లారు. అనంతరం జనసంచారం లేని ప్రదేశంలో అతడు కారును ఆపాడు. అక్కడ యువతిపై లైంగికదాడికి యత్నించాడు. దీంతో ఆమె పెద్దగా అరిచింది.అదేమార్గంలో వెళ్తున్న నీలాంజనా ఛటర్జీ దంపతులు ఇది గమనించి యువతిని రక్షించబోయారు. నీలాంజనా ఛటర్జీ యువతిని రక్షించటానికి కారు దిగి రోడ్డు మీద నిలబడ్డారు. వీరిని చూసి యువకుడు కారును ఆమెమీదుగా పోనిచ్చాడు. కదులుతున్న కారులోంచి తన ఫ్రెండ్‌ను నెట్టేశాడు. దీంతో నీలాంజనా ఛటర్జీ రెండు కార్లు టైర్లకిందపడి నలిగిపోయాయి. అనంతరం నీలాంజన భర్త పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. సదరు యువతి ఫిర్యాదుమేరకు యువడిపై అత్యాచార యత్నం కింద కేసు నమోదుచేశారు.