సారథి న్యూస్, రామడుగు: లాక్డౌన్తో పనిలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. ప్రస్తుత సమయంలో ప్రభుత్వం విద్యుత్బిల్లులను రద్దు చేయాలని సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సృజన్ కుమార్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం విద్యుత్ సెక్షన్ ఆఫీస్ ఎదుట కార్యకర్తలతోకలిసి ధర్నా చేపట్టారు. అనంతరం కార్యాలయ సిబ్బందికి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో నాయకులు గంటే రాజేశం, మచ్చ రమేష్, తదితరులు పాల్గున్నారు.
- June 15, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- CPI
- ELECTRICITY BILLS
- KARIMNAGAR
- RAMADUGU
- ధర్నా
- వినతి పత్రం
- Comments Off on విద్యుత్ బిల్లుల రద్దు చేయండి