సారథి న్యూస్, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ప్రధాన రోడ్డుపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఇటీవల కొత్తగా నిర్మించిన లింక్ రోడ్ ను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం ప్రారంభించారు. జూబ్లీహిల్స్ రోడ్ నం.70 ప్రశాసన్ నగర్ నుంచి రోడ్ నం.78 వరకు రూ.2.81కోట్ల వ్యయంతో 0.47 కి.మీ మేర ఈ లింక్ రోడ్డును నిర్మించారు. తద్వారా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్, దర్గా రోడ్ ద్వారా సులభంగా పాత ముంబై రోడ్డుకు వెళ్లే అవకాశం ఉంది. నగరంలో మరో ఐదు లింక్ రోడ్ల పనులను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
- June 22, 2020
- Archive
- హైదరాబాద్
- KTR
- LINK ROAD
- కేటీఆర్
- జూబ్లీహిల్స్
- లింక్ రోడ్
- Comments Off on లింక్ రోడ్ ప్రారంభం