సారథి న్యూస్, అనంతపురం: ఏపీలోని అనంతపురం నగరంలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేద్దామని జిల్లా ఎస్పీ భూసారపు సత్యఏసుబాబు చెప్పారు. శనివారం స్థానిక పోలీసు కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు.
కరోనా మహమ్మారి నేపథ్యంలో వృద్ధులు నిత్యావసర సరుకులు, కూరగాయలు, పండ్లు, మందులు దుకాణాలు, తోపుడు బండ్ల వ్యాపారం చేయకూడదన్నారు. పాతఊరు తిలక్ రోడ్డు, గాంధీబజార్, కూరగాయల మార్కెట్ ప్రాంతాల్లోని దుకాణాల వద్ద జనం గుమిగూడకుండా దృష్టిపెట్టాలన్నారు. దుకాణాల వద్ద భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, తదితర జాగ్రత్తలు తీసుకోకపోతే దుకాణాల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
సమావేశంలో అనంతపురం నగర పాలక సంస్థ కమిషనర్ ప్రశాంతి, డీఎస్ వో శివశంకర్ రెడ్డి, ఓఎస్డీ రామకృష్ణ ప్రసాద్, అనతపురం డీఎస్పీ జి.వీరరాఘవరెడ్డి, ట్రాఫిక్ డీఎస్పీ మున్వర్ హుస్సేన్, పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.