సారథి న్యూస్, కర్నూలు: రైతులకు మేలు చేయాలనే సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టిందని నంద్యాల సబ్ కలెక్టర్ కల్పనాకుమారి అన్నారు. సోమవారం మున్సిపల్ కార్యాలయం సమావేశ భవనంలో వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకంపై డివిజన్ స్థాయి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల సబ్ కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించడమే లక్ష్యంగా వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులను చైతన్యపర్చాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వ ఉద్యోగులపై ఉందన్నారు. గ్రామసభలు ఏర్పాటుచేసి రైతులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు అడిగిన వెంటనే కరెంట్ కనెక్షన్లు ఇవ్వాలని సూచించారు. కందికాయపల్లెలో రైతు కనెక్షన్స్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు ఇవ్వలేదన్నారు. సమావేశంలో విద్యుత్ ఈఈ నాగరాజు, వ్యవసాయశాఖ ఎఫ్‌టీసీ, ఏడీఏ విల్సన్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నారు.
- October 5, 2020
- Archive
- లోకల్ న్యూస్
- Kurnool
- NANDYALA SUB COLLECTOR
- PANYAM
- ఆళ్లగడ్డ
- కర్నూలు
- నంద్యాల సబ్‌కలెక్టర్
- పాణ్యం
- Comments Off on రైతుల మేలు కోసమే ఉచిత విద్యుత్