సారథి న్యూస్, ఖమ్మం: డీసీసీబీ సహకార రుణాలను పెంచి.. సొసైటీలకు ఇవ్వాలని డీసీసీబీ చైర్మన్కూరాకుల నాగభూషయ్యను డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు కోరారు. బుధవారం ఖమ్మం డీసీసీబీ ఆఫీసులో చైర్మన్‌ను కలిసి రుణాల విషయమై చర్చించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 99 సొసైటీలకు రూ.50కోట్లు మంజూరు చేశారని, రుణాలు పొందని రైతులు ఎక్కువగా ఉండడంతో ఆ మొత్తం సరిపోవడం లేదని, సొసైటీలకు రుణాలు మంజూరు పెంచేలా చర్యలు చేపట్టామన్నారు. కొన్ని మండలాల్లో 4 నుంచి 5 సొసైటీలు ఉన్నాయని, అందరికీ ఒకేలా రుణాలు మంజూరు చేస్తే ఒకే ఒక్క సొసైటీ ఉన్న మండలంలోని రైతులు ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ఆయన వెంట ఖమ్మం డీసీసీబీ సీఈవో వేణుగోపాల్, పాల్వంచ సొసైటీ సీఈవో లక్ష్మీనారాయణ ఉన్నారు.
- July 2, 2020
- Archive
- ఖమ్మం
- DCCB
- KHAMMAM
- SOCIETY
- ఖమ్మం
- డీసీసీబీ
- రుణపరిమితి
- Comments Off on రుణపరిమితి పెంచండి