ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నారట.. అలా ఉంది వీళ్ల తీరు చూస్తుంటే. ఇలా ప్రేమ సెల్ఫీ వైరల్ అయ్యిందో లేదో, రానా, మిహికాల నిశ్చితార్థం అయిపోయిందంటున్నారు జనాలు. నిన్న సాయంత్రమే నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రచారం జరగడంతో అదేమీ నిజం కాదంటూ కొట్టి పారేశాడు రానా ఫాదర్ సురేష్ బాబు. ఇంకా రెండు కుటుంబాలు కలసి కూర్చొని మాట్లాడుకోనేలేదు.. అప్పుడే నిశ్చితార్థం ఏమిటి అంటున్నాడు.
ప్రజెంట్ సిట్యుయేషన్ లో అది సాధ్యం కాదని కూడా అన్నాడు. కానీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో సంగతేమిటి అని అడిగితే మాత్రం నోరు మెదపడం లేదు మరి. పెళ్లికళ కొట్టొచ్చేట్టు వైట్ షర్ట్, పంచెలో రానా.. ధగ ధగలాడే పట్టుచీర నగలతో మిహికా ఉన్న ఈ ఫొటోలను చూస్తే ఎవరికి మాత్రం అనుమానం రాదు. అయితే రానా ఫ్యాన్స్ ఆతృత పడుతున్నా కుటుంబసభ్యులు మాత్రం ఎలాంటి అధికారిక వివరణ ఇవ్వలేదు. ఏకంగా పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తారో వేచిచూడాలి మరి.