సారథిన్యూస్, సిద్దిపేట: ఆత్మహత్యకు యత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు రక్షించారు. అతడి మొబైల్ నంబర్ ఆధారంగా అతడు ఉన్న ప్రదేశాన్ని గుర్తించి అతడి ప్రాణాలు కాపాడారు. సిద్దిపేటకు చెందిన కాశితే శ్రీనాథ్ గురువారం రాత్రి ఇంట్లో గొడవపెట్టుకొని తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ బయటకు వెళ్లాడు. దీంతో అతడి తండ్రి ఐలయ్య వన్‌టౌన్ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ సైదులు, ఐటీ సిబ్బందితో కలిసి శ్రీనాథ్ మొబైల్ నంబర్ ఆధారంగా అతడు స్థానిక ఎల్లమ్మ ఆలయం పరిసరప్రాంతాల్లో ఉన్నట్టు జీపీఎస్ ఆధారంగా గుర్తించారు. పోలీసులు అక్కడికి వెళ్లి చూడా శ్రీనాథ్ చేయికోసుకొని కనిపించాడు. వెంటనే అతడిని సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తీసుకెళ్లి చికిత్స ఇప్పించారు. అనంతరం అతడికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.
- July 10, 2020
- Archive
- క్రైమ్
- మెదక్
- లోకల్ న్యూస్
- POLICE
- SIDDIPET
- SUCIDE
- పోలీసులు
- మొబైల్
- Comments Off on యువకుడిని కాపాడిన పోలీసులు