సారథిన్యూస్, పెద్దపల్లి: మొక్కల సంరక్షణ మన అందరి బాధ్యత అని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పర్యావరణహితం కోసం ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మైడిపల్లి వద్ద గురువారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం గత ఆరేండ్లలో 150 కోట్ల మొక్కలను నాటిందని ఆయన చెప్పారు. అంతకుముందు మంత్రి అంతర్గాం మండలంలోని కందనపల్లిలో మంత్రి పర్యటించి అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమాల్లో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మేయర్ అనిల్ కుమార్, సింగరేణి అధికారి నారాయణ, జెడ్పీటీసీ ఆముల నారాయణ, పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
- July 23, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- HARITHAHARAM
- KOPPULA
- MINISTER
- PLANTS
- కొప్పుల
- సంరక్షణ
- Comments Off on మొక్కల సంరక్షణ మన బాధ్యత