Breaking News

మెదక్​లో కరోనా ల్యాబ్

సారథి న్యూస్, మెదక్: కరోనా వైరస్​ కేసులు పెరుగుతుండడం, టెస్టుల కోసం హైదరాబాద్ వెళ్లడం ఇబ్బందికరంగా మారడంతో మెదక్​లోనే కోవిడ్​–19 టెస్టింగ్​ ల్యాబ్​ ఏర్పాటు చేసినట్టు మెదక్​ ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి వెల్లడించారు. మెదక్ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన ల్యాబ్​ను శుక్రవారం ఆమె కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డితో కలిసి ప్రారంభించారు. మెదక్ జిల్లా ప్రజలు కరోనా పరీక్షలు చేయించుకోవడానికి సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రికి వెళ్లి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో పట్టణంలోనే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

ప్రజలు ఎవరికైనా కరోనా ఉన్నట్లు అనుమానం వచ్చినట్లయితే వైద్యసిబ్బంది వారి ఇంటి వద్దకే వచ్చి నమూనాలు (శాంపిల్స్) తీసుకెళ్తారని, అనంతరం వాటిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టెస్టింగ్ సెంటర్లో పరీక్షిస్తారని తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్​ ఎం.ధర్మారెడ్డి, జడ్పీ వైస్ చైర్​ పర్సన్ లావణ్యరెడ్డి, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్​ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.