Breaking News

మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో మూడు కరోనా కేసులు నమోదయ్యాయి. 28వ తేదీన జిల్లాలోని పాపన్నపేట మండలం కొడపాక గ్రామానికి చెందిన నాలుగేళ్ల బాలుడు, చేగుంటకు చెందిన 54ఏళ్ల వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు టెస్టుల్లో తేలింది. ఈ క్రమంలో వారి కుటుంబసభ్యులను క్వారంటైన్​కు తరలించి, కరోనా లక్షణాలు ఉన్న వారికి టెస్టులు చేశారు. ఈ మేరకు ఆదివారం చేగుంటలో కరోనా సోకిన వ్యక్తి భార్యకు కూడా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆమెను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

అలాగే హైదరాబాద్ లో పోలీస్ కానిస్టేబుల్ ట్రైనింగ్ లో ఉన్న ఇద్దరు యువకులకు సైతం కరోనా వచ్చింది. మెదక్ జిల్లాకు అలాట్ చేసినప్పటికి వారు జిల్లాకు రాలేదు. కాగా చేగుంటకు చెందిన మహిళతో పాటు, ఇద్దరు కానిస్టేబు ల్ ను కలిపి మెదక్ జిల్లాలో ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు ప్రభుత్వం హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. మొన్న నమోదైన రెండు కేసులతో కలుపుకుని జిల్లాలో కరోనా కేసుల సంఖ్య ఐదుకు చేరింది.