Breaking News

మెదక్ జిల్లాలో 10 కరోనా కేసులు

మెదక్ జిల్లాలో 10 కరోనా కేసులు

సారథి న్యూస్, మెదక్: మెదక్ జిల్లాలో కరోనా రోజురోజుకు విస్తరిస్తోంది. ఇప్పటివరకు జిల్లాలో 67 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. శనివారం మరో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మెదక్ టౌన్ లోని ఫతేనగర్ లో మూడు, రాంనగర్ వీధిలో ఒకటి, కౌడిపల్లి మండలం కంచాన్ పల్లిలో ఒకటి, చేగుంట మండలం రాంపూర్ లో ఒకటి, కర్నాల్ పల్లిలో ఒకటి, చేగుంటలో ఒకటి, తూప్రాన్ మండలం ఘనపూర్ లో ఒకటి, పాపాన్నపేట మండలం ఎల్లాపూర్ లో ఒక కేసు చొప్పున నమోదైనట్టు డీఎంహెచ్ వో డాక్టర్ వెంకటేశ్వర్ రావు తెలిపారు.