మెక్సికో: మెక్సికోలోని ఇరాపుయాటో సిటీలో బుధవారం కాల్పుల కలకలం రేగింది. రీహాబిటేషన్ సెంటర్లో ఒక వ్యక్తి విచక్షణా రహితంగా కాల్పులు జరపడంతో 24 మంది అక్కడికక్కడే చనిపోగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయని పోలీసులు చెప్పారు. కాల్పులకు పాల్పడిన వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడని అన్నారు.. దాడికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
లోకల్‌గా డ్రగ్స్ వ్యాపారం చేసేవవాళ్లే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడి.. రక్తంతో సంఘటనా స్థలం భయానకంగా మారిందని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. మెక్సికోలో ఇలాంటి గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. జూన్ 10న ఒక రీహాబిటేషన్ సెంటర్లో ఒక వ్యక్తి కాల్పులకు పాల్పడడంతో 10 మంది చనిపోయారు. మెక్సికో సిటీలో వాయిలెన్స్‌ను కంట్రోల్ చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రెసిడెంట్ ఆండ్రిస్ మన్యుయెల్ చెప్పిన కొద్దిరోజులకే ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. డ్రగ్స్ బిజినెస్ చేసేవాళ్లు ఈ రీహ్యాబిటేషన్ సెంటర్లపై తరచూ దాడికి పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో పోయిన ఏడాది ఆగస్టులో జరిగిన దాడిలో 26 మంది చనిపోయారు.