రైస్ మిల్లులకు ధాన్యం తరలించాలి
సారథి న్యూస్, మెదక్: ధాన్యం కొనుగోలు, నాణ్యత పరిశీలన, రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియపై కలెక్టరేట్ లో మెదక్ జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. అకాలవర్షాలకు రైతులు ధాన్యం నష్టపోకుండా వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని సూచించారు. హమాలీలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. రైతులకు సకాలంలో డబ్బులు చెల్లించేందుకు ఆన్ లైన్లో అప్ లోడ్ చేయాలన్నారు. మిల్లుల్లో ఖాళీ అయిన గోనె సంచులను వెంటనే గోదాంలకు తిరిగి ఇవ్వాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌర సరఫరాలశాఖ అధికారి శ్రీనివాస్, మార్కెటింగ్ శాఖ ఏడీ రమ్య, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చంద్రపాల్, ఇఫ్కో డైరెక్టర్, కొనాపూర్ సొసైటీ చైర్మన్ దేవేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు సోములు, అన్ని బాయిల్డ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.