కోలీవుడ్ హీరో విజయ్ నటిస్తున్న చిత్రం ‘మాస్టర్’. ఈ చిత్రానికి ‘ఖైదీ’ ఫేమ్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించగా గ్జేవియర్ బ్రిట్టో నిర్మిస్తున్నారు. మాళవికా మోహనన్ హీరోయిన్. విజయ్ సేతుపతి విలన్గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్ ఇటీవల విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది.
ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న తెలుగు, తమిళ భాషల్లో రీలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా దెబ్బతో ఆ ప్లాన్ మారిపోయింది. తెలుగు డబ్బింగ్ హక్కులను మహేష్ కోనేరు సొంతం చేసుకున్నారు. ఈ మూవీ రిలీజ్పై తాజాగా నిర్మాత మహేష్ కోనేరు క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు ఎప్పుడు రానుందో చెప్పాలనుకుంటున్నారు.
‘మాస్టర్’ రిలీజ్కు రెండు ఆప్షన్లు ఉన్నాయని, అందులో ఒకటి దీపావళి రిలీజ్.. మరొకటి వచ్చే ఏడాది సంక్రాంతి రిలీజ్. ఈ రెండు ఆప్షన్లలో ఏది ఫైనల్ అవుతుందనేది కరోనా కట్టడి బట్టి ఉంటుందట. ఓటీటీ ప్లాట్ ఫామ్నుంచి వస్తున్న ఆఫర్ల గురించి ప్రస్తావిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ ఈ చిత్రాన్ని ఓటీటీ ప్లాట్ ఫామ్లలో రిలీజ్ చేసే ప్రసక్తే లేదని, ఈ సినిమా కచ్చితంగా థియేటర్లలోనే రిలీజ్ అవుతుందని మహేష్ కోనేరు స్పష్టం చేశారు.