ఆర్జీవీ శిష్యుడు, మొదటి సినిమాతోనే తెలుగు ఫిల్మ్ ఇండస్ర్టీలో ప్రకంపనలు సృష్టించిన అజయ్ భూపతి కొత్త చిత్రం మహాసముద్రంలో యువనటుడు శర్వానంద్ హీరోగా చాన్స్ కొట్టేశాడు. మహాసముద్రం స్ర్కిప్ట్ ఎప్పుడో పూర్తయినప్పటికీ.. పలు కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోతూ వస్తున్నది. తాజాగా శర్వానంద్ ఈ సినిమాలో నటించనున్నట్టు సమాచారం. కాగా హీరోయిన్గా రాశీఖన్నా ఎంపికైందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కరోనా పరిస్థితులు ఓ కొలిక్కిరాగానే సినిమాని పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం కొరకు పనిచేయనున్న నటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. అజయ్‌భూపతి మొదటి సినిమా ఆర్ఎక్స్ 100తో ప్రత్యేకగుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ చిత్రంలో నటించిన హీరో కార్తికేయ.. హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు ఎంతో క్రేజ్ వచ్చింది.
- July 6, 2020
- Archive
- సినిమా
- AJAYBHUPATHY
- HERO
- NEWMOVIE
- RASHIKANNA
- RX100
- SHARVANAND
- అజయ్‌భూపతి
- మహాసముద్రం
- Comments Off on ‘మహాసముద్రం’లో హీరోగా శర్వానంద్