![మలయాళ రీమేక్‌లో విశ్వక్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/visw-2f.jpg?fit=218%2C330&ssl=1)
రీసెంట్గా ‘హిట్’ సినిమాతో హిట్ కొట్టిన విశ్వక్ సేన్ ఓ మలయాళ రీమేక్ చిత్రం చేయనున్నాడట. ‘ఫలక్‌నుమా దాస్’తో హైప్ నందుకున్న విశ్వక్ డిఫరెంట్ కాన్సెప్ట్‌లను ఎంచుకోవడంలో ముందుంటాడు. ప్రస్తుతం ‘హిట్’ సీక్వెల్, పాగల్ సినిమాలకు కమిటై ఉన్నాడు విశ్వక్. అయితే ఇప్పుడు ఈ మలయాళ రీమేక్‌లో నటించనున్నాడని టాలీవుడ్ టాక్. ‘అయ్యప్పన్ కోషియమ్’ను రీమేక్ చేయనున్న సంస్థ సితార ఎంటర్ టెయిన్ మెంట్స్ ఈ ఏడాది రిలీజై అక్కడ హిట్ కొట్టిన మలయాళ మూవీ ‘కప్పేలా’ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకుందట. ఈ సినిమాలో ఒక హీరో పాత్రకు విశ్వక్‌ను సంప్రదించగా ఓకే చెప్పాడట. ‘సెల్ ఫోన్ లో రాంగ్ నంబర్ వల్ల ఒక పల్లెటూరి అమ్మాయికి ఒక ఆటో డ్రైవర్‌తో పరిచయం ఏర్పడుతుందట. దానివల్ల ఆమె ఎలాంటి ఇబ్బందులకు గురైంది’ అనేదే చిత్రాంశం. చిన్న సినిమాగా రిలీజై అక్కడ సూపర్ సక్సెస్‌ను అందుకుందీ మూవీ. మరి ఈ రీమేక్ ఇక్కడ ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో అంటోంది ఫిల్మ్ నగర్.