సారథి న్యూస్, రామడుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కనిపించడం లేదని బుధవారం రామడుగు పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు ఫిర్యాదుచేశారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఒంటెల కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ బాధ్యత కలిగిన హోదాలో ఉండి కూడా ప్రజాసమస్యలను గాలికొదిలేసి తిరుగుతున్నారని ఆరోపించారు. వరి ధాన్యం తూకాల్లో మోసాలు చేస్తున్నా ఒక్కరోజైనా మంత్రి గంగుల కమలాకర్ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పాపానపోలేదని అన్నారు. మరో మంత్రి ఈటల రాజేందర్ హైదరాబాద్ కే పరిమితమయ్యారని విమర్శించారు. మున్సిపాలిటీల్లో వసతులు కల్పించడంలో మంత్రి కేటీఆర్ విఫలమయ్యారని అన్నారు. ఫిర్యాదుచేసిన వారిలో బీజేపీ మాజీ మండలాధ్యక్షుడు ఉప్పు రాంకిషన్, ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పొన్నం శ్రీనివాస్ గౌడ్, జితేందర్ ఉన్నారు.
- June 10, 2020
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- KARIMNAGAR
- RAMDUGU
- ఈటల
- కేటీఆర్
- మంత్రి గంగుల
- Comments Off on మంత్రులు కనిపిస్తలేరు