అయోధ్య: కరోనా విస్తరిస్తున్న ప్రస్తుత సమయంలో భక్తులెవరూ అయోధ్యకు రావొద్దని రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ కోరారు. ఆగస్టు 5న అయోధ్యలో రామమందిర శంకుస్థాపన జరుగుతున్న విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో చంపత్ రాయ్ ఈ ప్రకటన చేశారు. దేశంలోని భక్తులందరూ తమ ఇంట్లోనే ఆరోజు పూజలు చేసుకోవాలని సూచించారు. రామమందిర శంకుస్థాపన చరిత్రలో నిలిచిపోతుందని ఆయన చెప్పారు. కరోనా విపత్తువేళ కేవలం పరిమితమైన సంఖ్యలోనే అతిథులను ఆహ్వానించినట్టు ఆయన చెప్పారు.