Breaking News

బోర్డర్‌‌ ఇష్యూపై భేటీ

న్యూఢిల్లీ: ఇండియా, చైనా మధ్య నెలకొన్న బోర్డర్‌‌ ఇష్యూపై రెండు దేశాల మిలటరీ అఫీషియల్స్‌ భేటీ కానున్నారు. లద్దాఖ్‌లో శనివారం ఈ భేటీ నిర్వహించనున్నట్లు అధికారులు చెప్పారు. ఇండియా నుంచి లెఫ్టినెంట్‌ జనరల్‌ హర్దీప్‌ సింగ్‌ ఈ భేటీ హాజరుకానున్నారు. పాజిటివ్‌ సంకేతాలు ఉన్నాయని అధికారవర్గాలు చెప్పాయి. 1962లో చైనా, ఇండియా మధ్య జరిగిన యుద్ధం నాటి నుంచి ఇది సీరియస్‌ ఇష్యూగానే ఉంది. 2017లో దాదాపు మూడు నెలల పాటు కొనసాగినప్పటికీ ఇప్పటి పరిస్థితి చాలా సీరియస్‌ అని అన్నారు.

లైన్‌ ఆఫ్‌ యాక్చువల్‌ కంట్రోల్‌ వద్ద చైనా, ఇండియా మధ్య కొద్ది రోజులుగా బోర్డర్‌‌లో టెంక్షన్‌ నెలకొంది. కొద్దిరోజులుగా డ్రాగన్‌ కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో అమెరికా కూడా సీరియస్‌ అయింది. కాగా, రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పినప్పటికీ.. చైనా, ఇండియా దాన్ని తిరస్కరించారు.