Breaking News

బాలయ్య ఆవేశం.. నాగబాబు ఆగ్రహం

లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్​లో ఆగిపోయిన సినిమా షూటింగ్​లు ఎప్పుడు మొదలు పెట్టాలనే అశం గురించి సినిమారంగ ప్రముఖులతో తెలంగాణ సీఎం కేసీఆర్ మే 22న ప్రగతి భవన్ లో సమావేశమై మంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్, నిరంజన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సినీ రంగ ప్రముఖులు చిరంజీవి, నాగార్జున, డి.సురేష్ బాబు, అల్లు అరవింద్, ఎన్.శంకర్, రాజమౌళి, దిల్ రాజు, త్రివిక్రమ్ శ్రీనివాస్, కిరణ్, రాధాకృష్ణ, కొరటాల శివ, సి.కల్యాణ్, మెహర్ రమేశ్, దాము తదితరులతో చర్చలలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ చర్చల్లో సినిమా షూటింగులు, రీ ప్రొడక్షన్ పునరుద్ధరణ, సినిమా థియేటర్ల పునఃప్రారంభం తదితర అంశాలపై చర్చించారు.

https://youtu.be/RmXXCR3NH54
బాలయ్య ఆవేశం.. నాగబాబు ఆగ్రహం

సినిమా షూటింగులకు అనుమతి ఇవ్వాలని, సినిమా థియేటర్లు తెరిచే అవకాశం ఇవ్వాలని సినీ రంగ ప్రముఖులు సీఎం కేసీఆర్​కు విజ్ఞప్తి చేయగా దీనికి ఆయన సానుకూలంగా స్పందించి.. కోవిడ్ వ్యాప్తి నివారణ మార్గదర్శకాలు పాటిస్తూ షూటింగులు నిర్వహించేలా ఎవరికి వారు నియంత్రణ పాటించాల్సి ఉంటుందని సూచించారు. అయితే ఈ మీటింగ్ విషయమై టాలీవుడ్ ప్రముఖ హీరో బాలకృష్ణ తనను ఆ మీటింగ్​ కు తనను పిలవలేదంటూ.. వారంతా భూములు పంచుకుంటున్నారా? అని ఆవేశంతో ప్రశ్నించిన వీడియో క్లిప్పింగ్​ ను బుధవారం సాయంత్రం మెగాస్టార్ తమ్ముడైన సీనియర్ నటులు నాగబాబు యూట్యూబ్​లో పోస్ట్ చేశారు.

బాలకృష్ణ వీడియోతో పాటు నాగబాబు కోపంగా బాలకృష్ణను ప్రశ్నిస్తూ ఆయన మాట్లాడేది తప్పంటూ.. టీడీపీ వాళ్లే ఆంధ్రాలో రియల్ఎస్టేట్ దందా చేశారంటూ ఎద్దేవా వేస్తూ.. తెలంగాణ గవర్నమెంట్​ను క్షమాపణ కోరాలని తన వీడియోను అప్​లోడ్​ చేశారు. ఈ వీడియో చూసిన వారు అసలే పరిస్థితుల బాగోలేని సమయంలో ఈ రచ్చ ఏమిటా? అని కొందరు.. పెద్ద వాళ్ల మధ్య రగులుకుంటున్న ఈ వివాదం ఇంకెలాంటి సంఘటనలకు దారితీస్తుందోనని కంగారు పడుతున్నారు మరికొందరు..