నందమూరి నటసింహం బాలయ్య బాబు మరో ప్రయోగాత్మక సైన్స్ ఫిక్షన్లో నటించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. గతంలో ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ‘ఆదిత్య 369’ బాలకృష్ణ కెరిర్‌లోనే గొప్పమైలురాయిగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మళ్లీ సింగీతమే బాలయ్య బాబుతో ఆదిత్య 369కు సిక్వెల్‌గా ఆదిత్య 999 అనే చిత్రాన్ని రూపొందించనున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కనున్నట్టు చిత్రపరిశ్రమ టాక్.
ప్రస్తుతం బాలయ్య బోయపాటి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. ఆ చిత్రానికి మోనార్క్ అనే వర్కింగ్ టైటిల్ ఖరారు చేశారు. గతంలో బోయపాటి బాలయ్యకు సింహా, లెజెండ్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను అందించిన విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ పూర్తయ్యింది. లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదాపడింది. పరిస్థితులు అనుకూలించాక ఈ సినిమా మళ్లీ పట్టాలెక్కనుంది.