సారథి న్యూస్, రామగుండం: బసంత్‌నగర్‌లో ఎయిర్ట్‌పోర్టు నిర్మాణం పూర్తయితే.. రామగుండం నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ పేర్కొన్నారు. రామగుండం ప్రాంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. మంగళవారం ఆయన పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని బసంత్‌నగర్‌లో ఎయిర్పోర్ట్ నిర్మించబోయే స్థలాన్ని పరిశీలించారు. రాష్ట్రంలో ఆరుచోట్ల ఎయిర్‌పోర్టులను నిర్మిస్తున్నారని అందులో బసంత్‌నగర్ ఒకటని ఆయన పేర్కొన్నారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ వాల్వ అనసూయ, సర్పంచ్ కొల లత, ఎంపీటీసీ దుర్గం కుమార్, సహకార సంఘం చైర్మన్ మామిడాల ప్రభాకర్, పాలకుర్తి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మగాని తిరుపతి గౌడ్, మాదాసు అరవింద్ తదితరులు ఉన్నారు.
- August 25, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- AIRPORT
- BASANTHNAGAR
- KARIMNAGR
- RAMAGUNDAM
- తెలంగాణ
- పెద్దపల్లి
- బసంత్‌నగర్
- రామగుండం
- Comments Off on బసంత్‌నగర్‌లో ఎయిర్పోర్ట్