సారథిన్యూస్, అనంతపురం: వివాదాస్పద అధ్యాత్మిక గురువు, త్రైతసిద్ధాంత రూపకర్త స్వామి ప్రబోధానంద శుక్రవారం అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తాడిపత్రిలోని ఆశ్రమం నుంచి ఆసుపత్రికి తరలిస్తుండగా మృతిచెందాడని ఆయన శిష్యులు తెలిపారు. 1950లో తాడిపత్రి మండలంలోని అమ్మలదిన్నె కొత్తపల్లె అనే గ్రామంలో ఆయన జన్మించారు. ఆయన అసలు పేరు పెద్దన్న చౌదరి. తొలుత భారత సైన్యంలో వైర్ లెస్ ఆపరేటర్ గా ఆయన పని చేశారు. సైన్యం నుంచి తిరిగి వచ్చిన తర్వాత తాడిపత్రిలో కొన్ని రోజులు ఆర్ఎంపీ డాక్టర్ గా సేవలందించారు. అనంతరం తాడిపత్రి సమీపంలోని చిన్నపొడమల గ్రామంలో శ్రీకృష్ణమందిరం పేరుతో ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆయుర్వేదంపై ఓ పుస్తకం కూడా రచించారు. గత ఏడాది గణేశ్ నిమజ్జన వేడుకల సందర్భంగా స్వామి ప్రభోదానందకు, అనంతపురం జిల్లాకు చెందని జేసీ సోదరులకు తీవ్ర ఘర్షణ చెలరేగింది. స్వామీ ప్రబోధానంద తరుచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచేవాడు.
- July 10, 2020
- Archive
- అనంతపురం
- ఆంధ్రప్రదేశ్
- ANANTAPURAM
- CONTROVERY
- PRABODANANDA
- SWAMI
- అధ్యాత్మిక గురువు
- త్రైతసిద్ధాంతం
- Comments Off on ప్రబోధానంద కన్నుమూత