–రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
సారథి న్యూస్, గోదావరిఖని: ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడడమే తమ ధ్యేయమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శనివారం గోదావరిఖని పట్టణంలోని శ్రీ లక్ష్మిఫంక్షన్ హాల్ లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాస్టర్లకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఎమ్మెల్యే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
పేదల కళ్లల్లో ఆనందం నింపాలన్నదే ఫౌండేషన్ కర్తవ్యమన్నారు. ప్రతి ఒక్కరూ లాక్ డౌన్ ను అమలు చేయాలని కోరారు. ఇంట్ల నుంచి బయటికి రావొద్దన్నారు. కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు దివాకర్, కార్పొరేటర్ అడ్డాల గట్టయ్య, దయానంద్ గాంధీ, బిషప్ జాన్ సుందర్, థామస్, మహిపాల్ పాల్గొన్నారు.