Breaking News

ప్రజల కనీస అవసరాలు తీర్చండి

సారథి న్యూస్​, హైదరాబాద్​: ప్రజల కనీస అవసరాలు తీర్చడంపై దృష్టి పెట్టాలని మున్సిపల్​, ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లలో మౌలిక సదుపాయాల కల్పనపై సోమవారం హైదరాబాద్​లో సమీక్ష సమావేశం నిర్వహించారు. వానాకాలంలో సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పారిశుద్ధ్యం, రోడ్ల నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మోడ్రన్​ స్లాటర్ హౌస్ లు నిర్మించాలన్నారు. సమావేశంలో మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, బి.గణేష్ గుప్తా, జీవన్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.