Breaking News

పేదలకు ‘జగనన్న చేదోడు’

సారథి న్యూస్​, శ్రీకాకుళం: నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపడానికే ‘జగనన్న చేదోడు’ కార్యక్రమం చేపట్టామని ఆంధ్రప్రదేశ్​ సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి వివరించారు. బుధవారం వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. టైలర్​ వృత్తిదారులు, నాయీ బ్రాహ్మణులు, రజకుల ఆర్థిక కష్టాలను పాదయాత్రలో తెలుసుకున్నానని వివరించారు. ప్రతి కుటుంబానికి రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అర్హులు ఏ ఒక్కరూ మిస్​ కాకూడదని సూచించారు. జూలై 8న ఇళ్లపట్టాలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో స్పీకర్​ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన కృష్ణదాస్, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి, జిల్లా కలెక్టర్ జె.నివాస్, బీసీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.రాజారావు పాల్గొన్నారు.