- ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్
న్యూఢిల్లీ: భారత్‌తో జరిగే పింక్ బాల్ టెస్ట్ ( డే నైట్) కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నానని ఆస్ట్రేలియా పేసర్ మిచెల్ స్టార్క్ అన్నాడు. ఈ మ్యాచ్‌లో పైచేయి సాధించేందుకు తాము అన్ని రకాల అస్ర్తాలను ప్రయోగిస్తామన్నాడు. ఈ ఏడాది చివరిలో ఆసిస్‌లో పర్యటించే టీమిండియా.. నాలుగు టెస్ట్‌ల సిరీస్ ఆడనుంది. ఇందులో ఒకటి డే నైట్ మ్యాచ్ ఆడతామని గతంలోనే గంగూలీ హామీ ఇచ్చాడు.
‘భారత్‌తో సిరీస్‌లో పింక్ బాల్ మ్యాచ్ ఉండడం చాలా గొప్ప విషయం. ఆ మ్యాచ్ సిరీస్ మొత్తానికే హైలెట్‌గా నిలుస్తుంది. బ్యాట్, బంతికి మధ్య రసవత్తరమైన పోటీ జరుగుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. టీమిండియా ఇప్పటికీ ఒకే ఒక మ్యాచ్ ఆడింది. కానీ మాకు చాలా అనుభవం ఉంది. ఇది మాకు అదనపు ప్రయోజనంగా మారుతుంది. సొంత గడ్డపై డే నైట్ టెస్ట్‌లో మా రికార్డు కూడా చాలా బాగుంది. దీనిని అందుకోవడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చు’ అని స్టార్క్ వివరించాడు.