సారథి న్యూస్, వనపర్తి: ఈనెల 8 తర్వాత కూడా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా అధికారులను ఆదేశించారు. శనివారం ఆమె అధికారులతో సమీక్షించారు. గ్రామాల పారిశుద్ధ్యం ఎంపీడీవోలు, ఎంపీవోలదే బాధ్యత అని అన్నారు. హరితహారం మొక్కల పెంపకంపై ప్లాన్ను సమర్పించాలని ఆదేశించారు. అంతకుముందు ఆమె ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ లో భాగంగా అమరచింత మున్సిపాలిటీలో పర్యటించారు. జడ్పీ హైస్కూలు ఆవరణలో హరితహారం మొక్కలు నాటారు. అమరచింత ఆత్మకూరు నుంచి వచ్చే మార్గంలో మొక్కల పెంపకం చూడకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డీపీవో రాజేశ్వరి, డీఎంహెచ్వో డాక్టర్ శ్రీనివాసులు, డీఆర్డీవో గణేష్ పాల్గొన్నారు.
- June 6, 2020
- మహబూబ్నగర్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- WANAPARTHY
- ప్రత్యేక పారిశుద్ధ్యం
- వనపర్తి
- Comments Off on పారిశుద్ధ్యం బాధ్యత అధికారులదే