Breaking News

నేను తల్లిని కాలేదు బాబోయ్​!

నటీ, నటుల వ్యక్తిగత జీవితాలపై రూమర్లు రావడం కొత్తేమీ కాదు. ఎంతో మంది సెలబ్రిటీలు తమ మీద వచ్చిన పుకార్లకు వివరణ ఇచ్చుకోలేక తలలు పట్టుకుంటారు. తాజాగా కన్నడ నటి, బిగ్​బాస్​ సీజన్​ 3 ఫేమ్​ నేహా గౌడ తల్లి అయ్యిందని ఆమె యూఎస్​లోని కాలిఫోర్నియాలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిందని పలు కన్నడ సైట్లు రాశాయి. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆమె స్పందించారు. ఈ వార్తలో నిజం లేదని తేల్చిచెప్పారు. తనను కనీసం సంప్రదించకుండా ఇలాంటి వార్తలు ఎందుకు రాస్తారంటూ ఆమె ఫైర్​ అయ్యారు. బిగ్ బాస్​ షోతో బాగా పాపులర్​ అయిన నేహా గతంలో పలు సీరియల్స్​లో నటించారు. 2018లో చందన్ గౌడను వివాహం చేసుకున్నారు. నేహా కాలిఫోర్నియాలో స్థిరపడ్డారు. కానీ, ఆమె ప్రస్తుతం ఇండియాలోనే ఉన్నట్టు సమాచారం. చందన్ కూడా మార్చిలో ఇండియాకు వచ్చారని, కొన్ని రోజులు సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నారని సమాచారం.