న్యూఢిల్లీ: నీట్, జేఈఈ పరీక్షలు యధాతథంగానే జరుగుతాయని సుప్రీంకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించింది. ఆగస్టు 17న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించడం కుదరదని తేల్చిచెప్పింది. నీట్, జేఈఈ పరీక్షలు వాయిదా వేయాలని ఆరురాష్ట్రాల మంత్రలు వేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టి వేసింది. కాగా, ఇప్పటికే జేఈఈ మెయిన్స్-2020 పరీక్షలు సెప్టెంబర్ 1న ప్రారంభమయ్యాయి. 6వ తేదీ వరకూ జరగనున్నాయి. ఈనెల 13న నీట్ పరీక్ష జరగనుంది. కరోనా మహమ్మారి నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు, పలు రాజకీయ పార్టీలు గతనెలలో ఆందోళన చేపట్టాయి. అయితే ఆగస్టు 17న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకే కేంద్రం కట్టుబడి పరీక్షల నిర్వహణ తేదీలను ప్రకటించడంతో ఎంట్రన్స్ కూడా షురూ అయ్యాయి. జేఈఈకి 9 లక్షల మందికి పైగా రిజిస్టర్ చేయించుకున్నారు.
- September 4, 2020
- Archive
- Top News
- జాతీయం
- JEE
- NEET
- SUPREME COURT
- జేఈఈ
- నీట్
- సుప్రీంకోర్టు
- Comments Off on నీట్, జేఈఈ పరీక్షలు యథాతధం