నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు.. ఇంట్లో ఉంచుకున్నా ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అదెలాగో చూడండి. నిమ్మ కాయలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో తెలిసిందే. వాటిని ఆహారంలో కలుపుకున్నా.. రసం తీసుకుని తాగినా ఆరోగ్యానికి మంచిది. నిమ్మలో విటమిన్-సీ, కాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఉదయాన్నే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం, తేనె కలిపి తాగితే బరువు తగ్గుతారు. వేసవిలో వేడి నుంచి ఉపశమనం పొందేందుకు నిమ్మరసం ఎనర్జీ డ్రింక్‌లా పనిచేస్తుంది. అయితే, నిమ్మకాయలను ఆహారంగా తీసుకోవడం వల్లే కాదు. ఇంట్లో ఉంచుకున్నా సరే ఆరోగ్యానికి మంచిదే. అదెలాగో చూడండి. మన పూర్వికులు గుమ్మానికి నిమ్మ కాయలు కట్టేవారు. ఇప్పటికీ కొన్ని దుకాణాలు, వాణిజ్య కేంద్రాల్లో నిమ్మకాయలను కడతారు. కొందరు నీటిలో నిమ్మకాయ, పసుపు వేసి అలంకరణగా పెడతారు. దీని వెనుక ఆరోగ్య ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలిస్తే ఆశ్చర్యపోతాం.
నిద్రపోయే ముందు నిమ్మకాయలను ముక్కలుగా కోసి బెడ్ రూమ్‌లో పెడితే గాలి శుభ్రమవుతుంది. నిమ్మకాయలను రూమ్‌లో పెడితే ప్రత్యేకంగా రూమ్ ప్రెషర్ అవసరం ఉండదు. నిమ్మ వాసనతో గది పరిమళ భరింతం అవుతుంది. నిమ్మకాయ ముక్కలను బెడ్రూంలో పెట్టుకుని నిద్రిస్తే శ్వాస చక్కగా తీసుకోగలుగుతారు.
ఒత్తిడిని తగ్గిస్తుంది
నిమ్మ వాసన డిప్రెషన్‌ను తొలగిస్తుంది. యాంగ్జైటీ దూరమై పాజిటీవ్ ఫీలింగ్స్ కలుగుతాయి.
నిమ్మ వాసనతో ఊపిరితిత్తుల పనితీరు మెరుగవుతుంది. నిమ్మ వాసన ఒత్తిడిని సైతం దూరం చేస్తుంది. ఆస్తమా, అలర్జీలు, జలుబు తదితర సమస్యలతో బాధపడుతున్నవారు నిమ్మ ముక్కలను బెడ్ రూమ్‌లో పెట్టుకుని నిద్రిస్తే మంచిది. ఇంట్లో దోమలు ఎక్కువగా ఉంటే నిమ్మకాయను కట్ చేసి లవంగాలను గుచ్చి పెట్టండి. దెబ్బకు దోమలు పారిపోతాయ్. ప్రయాణాల్లో నిమ్మకాయ వాసన చూడటం వల్ల కడుపులో తిప్పడం, వికారం తగ్గుతుంది. కాబట్టి.. అది ఇంట్లో ఉంటే ఆ సమస్యలే దరిచేరవు.
నిమ్మతో మరిన్ని ఉపయోగాలు
నిమ్మ కాయలను ఆహారంతో తీసుకుంటే వృద్ధాప్య చాయలు కనిపించవు. నిమ్మరసాన్ని జుట్టుకు పట్టించడం వల్ల చుండ్రు సమస్యను అరికట్టవచ్చు. నిమ్మరసం రక్తాన్ని శుద్ధి చేసి, అందులోని రోగ కారక క్రిములను నశింపజేస్తుంది. రోజూ నిమ్మరసం తీసుకోవడం వల్ల కలరా, మలేరియా వంటి వ్యాధులు దరిచేరవు. ముఖం మీద ఏర్పడే నల్లటి మచ్చలను తగ్గించడంలోనూ నిమ్మ ఉపయోగపడుతుంది. రోజుకో గ్లాస్ నిమ్మ రసం తాగితే వల్ల ఆర్థరైటీస్, జీర్ణ సంబంధ సమస్యల నుంచి బయటపడవచ్చు.