హైదరాబాద్: కీసర తహసీల్దార్ ఏసీబీ అధికారులకు పట్టుబడిన వ్యవహారంతో తనకు సంబంధం ఉన్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమేనని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఒక్క పైసా సంబంధం ఉన్నా శిక్షకు సిద్ధమని ప్రకటించారు. తనపై చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని ఖండించారు. తన పాత్ర ఉంటే ప్రభుత్వం బయట పెట్టాలని డిమాండ్ చేశారు. కీసర వ్యవహారంలో రేవంత్‌రెడ్డి లెటర్ హెడ్స్ దొరికిన విషయాన్ని మీడియా ప్రశ్నించగా.. అవి తనవేనని, ఆర్టీఐ కింద దరఖాస్తు పెట్టినట్లు తెలిపారు. తన లెటర్‌హెడ్స్ లభించడంపై తప్పేముందని ప్రశ్నించారు. అందులో ఉన్న సమాచారానికి, కీసర వ్యవహారానికి సంబంధం ఏమిటని ఎంపీ రేవంత్‌రెడ్డి నిలదీశారు.
- August 22, 2020
- Archive
- పొలిటికల్
- KISARA TAHASHILDAR
- MALKAJIGIRI
- MPREVANTH REDDDY
- ఎంపీ రేవంత్‌రెడ్డి
- ఏసీబీ
- కీసర తహసీల్దార్
- మల్కాజిగిరి
- Comments Off on నాపై నిరాధార ఆరోపణలు