లండన్: జాతి వివక్షకు వ్యతిరేకంగా ఫార్మూలా వన్ కూడా గళం కలిపింది. ఈ సీజన్లో తాము పాల్గొనే ప్రతి రేస్‌లో బ్లాక్ కార్లతో బరిలోకి దిగుతామని ఎఫ్–1 టీమ్ మెర్సిడెజ్ ప్రకటించింది. వరల్డ్‌లో ఎక్కడా జాతి వివక్ష ఉండకూడదని టీమ్ ప్రిన్సిపల్ టొటోవోల్ఫ్ వెల్లడించాడు. సాధారణంగా మెర్సిడెజ్ కార్లన్నీ సిల్వర్ రంగులో ఉంటాయి. ‘జాతి, వర్ణ వివక్షపై నోరు మెపకుండా ఉండకూడదు. జాతి వివక్షపై మా సంకల్పం, ప్రతిబింబించేలా మేం నలుపు రంగు కార్లతో సర్క్యూట్‌పై దూసుకుపోతాం. మమ్మల్ని చూసి ఈ వివక్షను అందరూ వ్యతిరేకించాలి. జాత్యాహంకారం నశించిపోయేలా చర్యలు ప్రారంభించాలి. అప్పుడు జాతి వివక్షకు గురైన వారి ఆత్మ శాంతిస్తుంది’ అని వోల్ఫ్ పేర్కొన్నాడు. ఆదివారం జరిగే ఆస్ట్రియా రేస్‌లో మెర్సిడెజ్ డ్రైవర్లు హామిల్టన్, బొటాస్.. బ్లాక్ కార్లతో బరిలోకి దిగనున్నారు.
- July 3, 2020
- Archive
- Top News
- క్రీడలు
- BLACK CARS
- FORMULAONE
- MERCIDEZ
- నల్లకార్లు
- ఫార్మూలా వన్
- మెర్సిడెజ్
- రేస్
- Comments Off on అందుకే నల్లకార్లతో రేస్