విచిత్రమైన ఆలోచనలతో ఎవరూ ఊహించని పనులు చేయడంలో ముందుండటం.. కాంట్రవర్సీనే తన ఇంటిపేరుగా మార్చుకున్న డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ‘క్లైమాక్స్’ రూపంలో మరో సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. గతంలో శృంగార తార మియా మాల్కోవాతో ‘జీఎస్టీ’ తీసి సంచలనం సృష్టించిన ఆర్జీవీ ఈసారి ‘క్లైమాక్స్’ అంటూ మళ్ళీ ఆమెను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. లాక్ డౌన్ లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన మూవీ పోస్టర్స్ టీజర్ ఓ రేంజ్ లో అలజడి సృష్టించాయి. ఈ సినిమాని రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎక్కడ తీశాడో ఎవరికీ తెలియదు.. కానీ డిజిటల్ స్ట్రీమింగ్ ద్వారా ‘క్లైమాక్స్’ సినిమాను జూన్ 7వ తేదీన రాత్రి 9 గంటలకు ‘ఆర్జీవీ వరల్డ్’ ఓటీటీలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. అంటే ఈ సాయంత్రం నుంచే క్లైమాక్స్ రచ్చ మొదలు కానుందన్నమాట. ఒక్కో వ్యూ కోసం రూ.100 చెల్లించాల్సి ఉంటుందని వర్మ ఇప్పటికే పేర్కొన్నారు. ‘పే ఫర్ వ్యూ’ విధానం ఇక్కడ అమల్లో ఉంటుందన్న మాట. ఇది వర్క్ అవుట్ అయితే ఇక నుంచి ఆర్జీవీ తన సినిమాలన్నీ ఇలానే రిలీజ్ చేద్దామని ఫిక్సయ్యాడట.
ఇదిలా ఉండగా వర్మ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల ప్రజలను తన గుప్పిట్లో పెట్టుకొని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో ‘కరోనా’ అనే సినిమా తీసిన సంగతి తెలిసిందే. దీని తర్వాత తాను తీయబోయే సినిమా విశేషాలు ప్రకటించేశాడు వర్మ. తాజాగా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమా ‘నగ్నం’ అనే పేరుతో తెరకెక్కిస్తున్నట్టు, మీకు కావాల్సినంత సెన్సేషన్ న్యూస్ దొరికేంత స్టఫ్ ఉంటుందంటున్నాడు. ఇప్పటికే వెబ్ కంటెంట్ కి సెన్సార్ లేకపోవడంతో రెచ్చిపోయి సినిమాలు తీస్తున్న వర్మ.. సినిమా పేరే ‘నగ్నం’ అని పెట్టాడంటే ఎలాంటి కంటెంట్ తో రాబోతున్నాడో అర్థం చేసుకోవచ్చు. సినీ రాజకీయ ప్రముఖుల లైఫ్ ఇన్సిడెంట్స్ అయినా శృంగార తారల లైఫ్ హిస్టరీ అయినా.. ఎన్ కౌంటర్ కు గురైన వ్యక్తుల జీవితాలైనా గ్యాంగ్ స్టర్ స్టోరీలనైనా తనదైన శైలిలో సినిమాగా తెరకెక్కించే ఆర్జీవీ ‘నగ్నం’తో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయబోతున్నాడో చూడాలి.
- June 7, 2020
- Archive
- సినిమా
- GST
- RAMGOPALVARMA
- ఓటీటీ
- నగ్నం
- మాల్కోవా
- Comments Off on ‘నగ్నం’తో ఆర్ జీవీ రచ్చ