Breaking News

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన

సారథి న్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వెలిచాల, రామడుగు, చిప్పకుర్తి, రాంచంద్రాపూర్, గుండి, గోపాలరావు పేట్, తిర్మలాపూర్, శ్రీరాములపల్లిలో ఏర్పాటుచేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణ మంగళవారం పరిశీలించారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఆయన మాట్లాడుతూ.. తూకం వేసిన ధాన్యాన్ని వర్షానికి తడవకుండా వెంటనే మిల్లులకు తరలించాలన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రతిఒక్కరూ మాస్క్ లు తప్పనిసరిగా ధరించి సామాజిక దూరం పాటించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మేకల ప్రభాకర్ యాదవ్,
చొప్పదండి అసెంబ్లీ కన్వీనర్ జిన్నారం విద్యాసాగర్, బీజేపీ మండల అధ్యక్షులు ఒంటెల కరుణాకర్ రెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు ఉప్పు రాంకిషన్, షానగర్ ఎంపీటీసీ కొత్త పద్మ, తిర్మలాపూర్ ఎంపీటీసీ మోడీ రవి, పొన్నం శ్రీనివాస్ గౌడ్, బండ తిరుపతి రెడ్డి, ఉప్పు శ్రీనివాస్ పటేల్, కొలపురి రమేష్, తోట కృష్ణ, పోచంపల్లి నరేష్, చింతపంటి అశోక్, కాడే నర్శింగం, అంజిబాబు పాల్గొన్నారు.