సారథి న్యూస్, కర్నూలు: తుంగభద్ర పుష్కరాలు సమీపిస్తున్న నేపథ్యంలో భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయాని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. 12 ఏళ్ల ఒకసారి వచ్చే పుష్కరాల్లో స్నానం చేస్తే.. ఎంతో పుణ్యఫం భిస్తుందని పేర్కొన్న ఆయన.. నవంబర్లో జరిగే పుష్కరాలకు తుంగభద్ర నదిలో నీళ్లు పుష్కలంగా ఉండేలా, మురుగు కలవకుండా, భక్తులకు ఇబ్బందులు లేకుండా ఘాట్లు ఏర్పాటు చేయాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డిని కోరారు. ఈ మేరకు బుధవారం వినతిపత్రం అందజేశారు. 24 ఏళ్ల క్రితం కర్నూలులో తుంగభద్ర పుష్కరాలను ప్రారంభించామని, 12 ఏళ్ల క్రితం కొనసాగించామని, ప్రస్తుతం కూడా నిర్వహించాలని కోరారు. స్పందించిన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తుంగభద్ర పుష్కరాకు ఏర్పాట్ల విషయమై ఎంపీ టీజీ వెంకటేష్ వినతిపత్రం అందజేశారని, అన్నిరకాల ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.
- July 1, 2020
- Archive
- కర్నూలు
- లోకల్ న్యూస్
- TG VENKATESH
- TUNGABADRA
- టీజీ వెంకటేష్
- తుంగభద్ర
- పుష్కరాలు
- Comments Off on తుంగభద్ర పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి